Breaking News

ఐటిఐలో చేరడానికి ఆఖరితేది జూన్‌ 30

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్‌ ఐటిఐలలో ఈ ఏడాది ప్రవేశాలకై ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటిఐ ప్రిన్సిపల్‌ కన్వీనర్‌ యం. కనకరావు ఒక ప్రకటలో తెలిపారు. 2022`23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేట్‌ ఐటిఐలలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు iti.ap.gov.in అన్‌లైన్‌ ద్వారా ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కి ప్రభుత్వ ఐటిఐ విజయవాడ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు హాజరై తమ యొక్క అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఫోర్టల్‌ నందు వెరిఫికేషన్‌ చేసే నిమిత్తం ప్రభుత్వ ఐటిఐలోని ప్రిన్సిపాల్‌ ద్వారా వెబ్‌సైట్‌ నందు ధ్రువీకరించుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌లో వాటి యొక్క జిరాక్స్‌ కాపీలు ఒక జత అన్‌లైన్‌లో అప్లైచేసిన తర్వాత తీసుకున్న దరఖాస్తు పత్రము (ఏకనాల్డ్‌ మెంట్‌ ఆఫ్‌ సబ్మిషన్‌ ఆఫ్‌ అప్లికేషన్‌) తప్పనిసరిగా తీసుకు రావాలన్నారు. సర్టిఫికెట్లు ధ్రువీకరణ హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్క్‌ తప్పని సరిగా ధరించాలి అని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ యం కనకరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *