-విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిఘా పెట్టండి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా రైతులలో భరోసా కల్పించేందుకు వ్యవసాయ అధికారులు, సలహా మండలి సభ్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలకరి ప్రారంభమైనందున రైతులు పంటలను చేపట్టేందుకు సన్నద్దం అవుతున్న తరుణంలో వ్యవసాయ సలహా మండలి రైతాంగానికి అవసరమైన పూర్తి సహాయ సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించడంలోను పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం మెట్టప్రాంతం అయినందున రైతులు మిర్చి, పత్తి, అపరాల పంటలను ప్రధానంగా సాగు చేయడం జరుగుతుందన్నారు. గత ఏడాది జిల్లాలో దాదాపు 42 వేల ఎకరాలలో మిర్చి పంటకు ఏర్పడిన నల్ల తామర తెగులు వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఈ`కాప్ర్ కింద పంటలను నమోదు చేసుకుని పూర్తి వివరాలు అందజేసిన రైతులకు బీమా సొమ్మును ఈనెల 14వ తేదీని అందించడం జరిగిందన్నారు. నాణ్యత గల ఏపి సీడ్స్ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా మిర్చి విత్తనాలను రైతులకు అందించాలని అన్నారు. నిర్థేశించిన ఎంఆర్‌పి ధరల కంటే విత్తనాలను అధిక ధరలకు విక్రయించే వారిపై 6ఏ కేసులను నమోదు చేయాలన్నారు. వ్యవసాయ పోలీస్ రెవెన్యూ లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లాలోని విత్తన విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమాలు పాల్పడె వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రైతు పండిరచే ప్రతి పంటను ఈ `క్రాప్‌లో నమోదు చేసి పంటల బీమా ద్వారా రైతులలో భరోసా కల్పించాలని కలెక్టర్ అన్నారు.
సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధరను పెంచాలని, రైతులకు సబ్సిడీపై మైక్రోన్యూట్రియన్స్, జిప్సమ్, నీమ్ ఆయిల్‌లను 50 శాతం సబ్సిడీపై అందించాలని, రైతు గ్రూప్‌లకు సబ్సిడీపై అందించే ఉపకరణాలను వ్యక్తిగతంగా కూడా అందించాలని, భూ యాజమానుల అంగీకారం లేకపోయినపట్టికి కౌలు రైతులకు క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్ (సిసిఆర్‌సి)లను అందించాలని జిల్లా వ్యవసాయ సలహా మండలిలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానం ద్వారా ప్రభుత్వానికి నివేధిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించి రైతుల సమస్యల పట్ల చర్చింది వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
సమావేశంలో అగ్రి కల్చర్ అడ్వజరీ బోర్డు చైర్మన్ డి. దామోదరరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం. విజయభారతి, ఉద్యాన శాఖ అధికారి ఏడి బి దయకర్ బాబు, మత్స్య శాఖ ఏడి సిఎస్ చక్రాణి, పశు సంవర్థక శాఖ అధికారి కె. విద్యా సాగర్, ఏపియంఐపి పిడి జి. విజయలక్ష్మి, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎస్ సత్యనారాయణ, మార్క్‌ఫడ్ జిల్లా మేనేజర్ నాగ మల్లిక, సలహా మండలి సభ్యులు కాజ బ్రహ్మయ్య, షేక్ నాగుల మీరా, వ్యవసాయ అధికారులు కె.సునీల్, డి వెంకటేశ్వరరావు, డి. రమణ మూర్తి, యం.రత్నశ్రీ, శశికళ, యం స్వప్న తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News