Breaking News

స్పందనలో 26 ఫిర్యాదులు అందాయి

-నగరపాలక సంస్థ పరిధిలో 770 మంది వార్డు కార్యదర్శుల సర్వీసు క్రమబద్దీకరణ
-మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డు కార్యదర్శులు మరింత నిబద్దతతో విధులు నిర్వర్తించాల్సిన భాధ్యత మీపై ఉందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వార్డులో అత్యంత పరిశుభ్రతను పాటించడం లో పర్యవేక్షణ, అర్హులకు పథకాలు చేరవేయడం లో నిబద్దత తి భాద్యతలు నిర్వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే ముందే నగరపాలక సంస్థ ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది ఆయా సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలోని 96 వార్డు సచివాలయాలలోని 770 మంది వార్డు కార్యదర్శుల ఉద్యోగాల ను క్రమబద్ధీకరిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. . వర్షాకాలం నేపథ్యం దోమలు ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి కి అవకాశం ఉందని , ప్రజల్లో వాలంటీర్లు ద్వారా అవగాహన పెంచాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కనపడకుండా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామని, ఇందులో సచియలయ కార్యదర్శులు ప్రత్యక్ష ప్రమేయం కావాలని ఆదేశించారు. ఈ రోజు స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి ఎం. సత్యవేణి, ఎస్ ఈ – జీ.పాండురంగారావు, సి పి – జే. సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *