Breaking News

స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై కార్యశాల…

-ఫిర్యాదుల పరిష్కారంలో సానుకూలత దోరణి చూపాలి
-జాయింట్ కలెక్టర్ శ్రీధర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ స్పందన ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో స్పందన లో వచ్చిన ప్రజల అర్జీలు పరిష్కారం పై జిల్లా స్థాయి అధికారులకు స్పందన గ్రివెన్స్ వేబ్సైట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ఫిర్యాదు దారునితో మాట్లాడి మెప్పించడం ముఖ్యం, ఒక్కసారి రీ ఓపెన్ అయిదంటే సంబందించిన అధికారి ఇంటికి వెళ్ళి వివరణ, వివరాలు అందజేస్తే మరోసారి ఫిర్యాదు చేయడం జరగదన్నారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ పై నాణ్యతతో కూడిన పరిష్కారం చేస్తే ప్రతి అర్జీదారుడు తనకు పూర్తి న్యాయం జరుగుతుంది. అర్జీదారుడు సంతృప్తి చెందక పోతే వారు మరల రీ ఓపెన్ చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు.

గ్రామ వార్డు సచివాలయం పరిధిలో తప్పకుండా ప్రజా సమస్యలు నమోదు కావలసి ఉందని , ముఖ్యమంత్రి ఈ వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం ముఖ్య ఉద్దేశ్యం అదేనని ఆర్ టి జి ఎస్ జిల్లా నోడల్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క ఫిర్యాదును ఎస్ ఎల్ ఏ (సేవా చట్టపరమైన /స్థాయి ఒప్పందం) లోపలే పరిష్కారం చుపాలనారు. ఆయా ఫిర్యాదులను 10 రోజుల నుంచి 90 రోజుల కాల పరిమితిలో పరిష్కారం చూపాలన్నారు.

అయితే కొంత మంది దిగువ స్థాయి సిబ్బంది ప్రజల సమస్యల పట్ల సానుకూల దృక్పథం లేన్నట్లు తమ క్షేత్ర స్థాయి తనిఖీల్లో చూశామన్నారు. ప్రతి ఫిర్యాదు వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడిన స్పందన ఫిర్యాదులు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్పందనలో వాటిని ఏవిధంగా రిజిస్ట్రేషన్ ( నమోదు) చెయ్యాలో , అథన్టికేషన్ వివరాలు తెలియచేశారు. కొందరు అధికారులు గ్రీవెన్స్ పరిష్కారం చేసే సమయంలో బ్లాంక్, అసంపూర్తి వివరాలతో పరిష్కారం చేసినట్లు పేర్కొనడం, ప్రధాన కార్యదర్శి దృష్టికి వచ్చిందని తెలియ చేశారు. ప్రజలు ఫిర్యాదుపై ఇచ్చే పరిష్కారం పై వివరణపై ప్రజలు సంతృప్తి పరచడం ముఖ్యం అన్నారు.

స్పందన అవగాహన కార్యక్రమం లో జిల్లా అధికారులు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి, డిఎస్ ఓ సివిల్ సప్లై ప్రసాదరావు, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ. రమేష్, డ్వామా పిడి పి జగదంబ, డిఎస్ఓ పి.ప్రసాదరావు, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి, జిల్లా హౌసింగ్ అధికారి ప్రేమ్ చంద్, డీఈఓ అబ్రహం,డిఎం హెచ్ ఓ స్వర్ణలత ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *