Breaking News

తూర్పు నియోజకవర్గంలో అబివృద్దికి పెద్దపీట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ కరివేపాకు తోట మెయిన్ రోడ్,ట్రెజరీ ఎంప్లాయిస్ కాలనీ లో సీసీ రోడ్లు మరియు నెహ్రు నగర్ రోడ్, అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ ప్రాంతాలలో పేవేర్ బ్లాక్స్ నిర్మాణ పనులకు స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ అధ్వర్యంలో దాదాపు 1కోటి 60 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో,ప్రాంతానికో పరిమితము కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికి అందాలనే సంయున్నత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన ఈ సమస్యలను తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేపించి బుధవారం నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో 6 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీలు, ఉర్దూ స్కూల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని,అందుకే మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల మధ్యలో తిరుగుతున్నామని ధీమా వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ టీడీపీ వాళ్ళ లాగా శంకుస్థాపన లు చేసి పనులు వదిలేయకుండా అవి పూర్తి అయ్యేవరకు నిత్య పర్యవేక్షణ చేస్తున్నామని,టీడీపీ నాయకులు కేవలం ప్రచార ఆర్భాటాలకు పరిమితం అని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ రోజు పేపర్ లో పడాలని ప్రజలలో అబద్దపు ప్రచారాలు చేసి,మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు అని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే నివాసం వుండే డివిజన్ అయిన సరే ఎపుడైనా ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకున్నార అని ప్రశ్నించారు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే లోపల చాల ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ డివిజన్ లో అభివృద్ధి జరిగిందని,అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాదే అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు దనేకుల కాళీ,ఇందిరా ఖలీమ్,చిన్న,మునీర్ అహ్మద్,జక్క శ్రీనివాస్, నాజీర్,చెన్నారెడ్డి,సత్యనారాయణ మరియు కాలనీ పెద్దలు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *