Breaking News

సాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో పేద కుటుంబాలకు తోడ్పాటును అందించటం కోసం ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరం కమిటీ ఆధ్వర్యాన సంధ్య కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గురువారం ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అని మన పెద్దలు కంటి ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారని అటువంటి నేత్రాలను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలన్నారు. బాబా మందిరం ద్వారా ఆధ్యాత్మికత, సేవలను రెండు కళ్ళుగా చేసుకుని పనిచేస్తున్నామన్నారు. తాము సేవా కార్యక్రమాలలో భాగంగా సంధ్య కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న భక్తులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్‌ ఎం.ఎన్‌.రాజు కుమారుడు, సంధ్య కంటి ఆసుపత్రి నిర్వాహకులు భార్గవ్‌ మాట్లాడుతూ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎం.ఎన్‌.రాజు ప్రారంభించిన ఈ వైద్యశిబిరాల ద్వారా ప్రజలు సేవలందించడ కోసం ఆయన తరువాత ఆయన పేరుమీద ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని భవిష్యత్‌లో మరిన్ని వైద్య శిబిరాల ద్వారా ప్రజలు సేవలు అందించే ఆలోచన వున్నట్లు తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్య కంటి వైద్యులు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుంచనపల్లి రవిశంకర్‌, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి, సభ్యులు కమ్మిలి రత్నకుమార్‌, ఆసుపత్రి డాక్టర్‌ కసిరాజు, రాజేష్‌, శివకుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *