Breaking News

సెంట్రల్ లో 85 శాతం కుటుంబాలకు నవరత్నాలతో లబ్ధి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అవినీతిలేని స్వచ్ఛమైన పాలన జగనన్నతోనే సాధ్యం
-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఆదర్శ పాలనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 32 వ డివిజన్ – 232 వ వార్డు సచివాలయం పరిధిలోని శాంతినగర్లో మంగళవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,907 గృహాలలో, 413 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం అనేది నిరంతర కార్యక్రమమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి కలిగిన లబ్ధి, వారి వ్యక్తిగత జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా కలిగిన మార్పును అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలతో 85 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నామని తెలియజేయడం జగనన్న సంక్షేమపాలనకు నిదర్శమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, పాలకులు సైతం వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని కొనియాడారు.

గుమ్మం వద్దనే సమస్య పరిష్కారం
చదువు నిమిత్తం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న నందుల బాల మాణిక్య వెంకట సాకేత్ అను విద్యార్థికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో సత్వర పరిష్కారం లభించింది. సోమవారం రోజున యువకుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి దృష్టికి సమస్యను తీసుకురాగా.. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడటంతో ఒక్క రోజులో ధ్రువీకరణ పత్రం మంజూరు అయింది. మంగళవారం పాదయాత్రలో ఎమ్మెల్యే చేతులమీదుగా సర్టిఫికెట్ అందజేయడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అత్యధిక శాతం కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క పథకం ద్వారా అయినా లబ్ధి చేకూరిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 232వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 2.68 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచి పనిలేదని విమర్శించారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు జ్ఞప్తికి వస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పాలన సాగిస్తూ.. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్విజయంగా అమలు చేస్తున్నారన్నారు. అలా చంద్రబాబు పేరు వింటే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కరోనా కష్టసమయంలోనూ 232వ సచివాలయ పరిధిలో 642 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు రూ. వెయ్యి చొప్పున ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కోవిద్ సమయంలో బయటకు రావాలంటేనే బయపడుతున్న సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవలందించారన్నారు. కరోనా టెస్టులు పెంచడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే, సత్వర చికిత్సకు చర్యలతో మన రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించడంలో వాలంటీర్లు పాత్ర అమోఘమన్నారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రశంసలు అందుకుందంటే వాలంటీర్ల ఎనలేని సేవలే అందుకు కారణమన్నారు. అటువంటి వ్యవస్థలపై బురద చల్లడమే ప్రతిపక్షాలు ప్రధాన అజెండాగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ యజ్ఞాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని.. 2019లోనే ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. బీమవరం, గాజువాక సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. మరోవైపు తొలి ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచినప్పుడు అది తమ పాలనకు వచ్చిందని డప్పాలు కొట్టుకున్న టీడీపీ నేతలు.. మూడేళ్ల తర్వాత వచ్చిన అవార్డుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు శ్యామ్, త్రివేణిరెడ్డి, సువర్ణరాజు, మాల్యాద్రి, వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, భోగాది మురళి, ఇసరపు రాజారమేష్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *