విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కు 15,వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉందని కేసి డివిజన్ ఇఇ పివిఆర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఇన్ ఫ్లో కొనసాగితే ఈనెల తొమ్మిదో తేదీ శనివారం పదివేల క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నందున కృష్ణానది తీరప్రాంత పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులు, మేకలు గొర్రెలను మేతకు వదలకుండా చూసుకోవాలని కె సి డివిజన్ ఇఇ పివిఆర్ కృష్ణారావు ఆ ప్రకటనలో అన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News