శ్రీ గురుదత్త సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి…

-కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే, నగర మేయర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ గురుదత్త సాయి సేవా సమితి ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లోని నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వెనుక వీధిలో బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా సద్గురు సాయినాథ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. పట్నాల అప్పన్న, చీర్ల రామస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులను వారి భక్తి ప్రభత్తులను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాము పాల్గొనడం ఆనందకరంగా ఉందన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేల వ్యాధి మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మాజీ కార్పొరేటర్లు రమణబాబు, జి. కోటేశ్వరరావు,అయితా కృష్ణ కిషోర్, సందక శివకుమార్, బెవర ఈశ్వర్, చీర్ల రామ్మోహన్, పిల్లా జగ్గు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *