ఘనంగా నెహ్రూ బొమ్మ సెంటర్ సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లోని సద్గురు సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి ప కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా బాబా వారి ఆశీస్సులతో ఆలయంలో ప్రత్యేక పూజలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బార్లు తీరారని, వారికి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహకులు సాయి, పొట్నూరి వెంకటేశ్వరరావులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలను చేస్తున్నట్లు, అదే విధంగా ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, వేలాది మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *