విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టును దశల వారిగా పూర్తి చేస్తున్నామని ఎగువ నుండి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ముంపునకు గురి అయ్యే ప్రాంతాల నిర్వాసితులను సురిక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
నగరంలోని స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణ కేంద్రంలో గురువారం రాష్ట్రంలోని వరద పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గోదావరి వరదకు ముంపుకు గురై నష్టపోయే ప్రాంతాల నిర్వాసితులను సురిక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమై ఉన్నామన్నారు. కృష్ణానదికి ఎగువ నుండి వరద వచ్చినా ప్రమాదాన్ని ఎదుర్కోనే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలై నెలలో గోదావరినదికి పెద్ద ఎత్తున వరద రావడం ఉహించడం కష్టమన్నారు. వంద సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం జరగలేదన్నారు. అనుకోని విధంగా వరద రావడంతో కొంత ఇబ్బంది కలగడం జరిగిందన్నారు. నిర్వాసితులను ఆ ప్రాంతం నుండి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నేటి వరకు గోదావరికి 16 లక్షల క్యూసెక్కులు వరదనీరు పోలవరం వద్ద ప్రవహిస్తుందన్నారు. ఎగువున భద్రాచలం నుండి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయుక్తంగా వరద ముంపుకు గురిఅయ్యే ప్రాంతాలలోని ప్రజానికాన్ని సకాలంలో తరలించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు సహకరించాలని, స్థానిక స్వచ్ఛంద సంస్థలు సహకారం ఉండాలని మంత్రి కోరారు. భద్రాచలం వద్ద ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమావేశమై ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు ఇస్తున్నారన్నారు.పెన్నానది పై పూర్వపు అనకట్టలను ఆధునీకరించి కొత్త బ్యారేజ్‌ల నిర్మాణాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునాదులు వేశారని ఆయన కుమారుడు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 17వ తేదిన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభించనున్నారన్నారు. కృష్ణానదికి ఎగువ నుండి వస్తున్న వరదనీటిని అంచనా వేస్తూ అవసరం మేరకు దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనులు దశలు వారిగా జరుగుతున్నాయని ఇప్పటికే కాపర్‌డ్యామ్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లలలో ఉన్న నీటి మట్టాలను అంచనా వేసి సామర్థ్యానికి మించిన అదనపు వరద నీటిని దిగువుకు విడుదల చేస్తున్నామని మంత్రి అన్నారు.
Prajavartha Online Telugu News