Breaking News

సంక్షేమ పథకాలతో ప్రతిఒక్కరికి లబ్ది… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వాలు 40ఏళ్లలో పాలనలో జరగిని అభివృద్ధి మా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళ లో అబివృద్ది చేసి చూపించాం అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శుక్రవారం నాడు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా 77వ సచివాలయాల పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికా,బహదూర్ కలిసి ఇంటింటికి పర్యటించి ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి గురుంచి లబ్దిదారులకు వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతున్నాయో లేదా అని ప్రజలను అడిగి తేలుకుంటున్నాం అన్నారు. అర్హులై ఉండి పథకాలు అందకపోతే సచివాలయ సిబ్బందికి,మున్సిపల్ అధికారులు కి చెప్పి పరిష్కరిస్తున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్లలోనే మేనిఫెస్టో లో 95% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని,గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్టాన్ని సంక్షేమం దిశగా తీసుకుపోతున్నాం అని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఆ పార్టీ వాళ్ళకే పథకాలు అందే విధంగా చూసుకునేవారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో రిటైనింగ్ వాల్ 130 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి పూర్తీ చేస్తున్నందుకు స్థానిక ప్రజలు జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా వైస్సార్సీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ సమీపంలో ఉన్న ఇండ్లు తొలగించకుండా కడుతున్నందుకు స్థానిక ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు అని అన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసత్యప్రచారాలు మానుకొని, ప్రజలకు మోసపూరిత మాటలు చెప్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు, కార్పొరేటర్లు అంబేద్కర్, రామిరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు ఈశ్వర ప్రసాద్, మల్లి, రాజా, శివ శంకర్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *