Breaking News

జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో హౌసింగ్ నిర్మాణ పనులను మరింత వేగం పెంచాలని, స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా హౌసింగ్ అధికారి టి. తారా సింగ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ హౌసింగ్, అనుబంధ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తారా సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు లో భాగంగా ఉచితంగా స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటితో పాటు గా ఇంటి నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ ను లే అవుట్ లలో అందుబాటులోకి తీసుకుని వచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్టేజ్ కన్వర్షన్ లోకుడా సరైన ప్రగతి దిశగా అడుగులు వేయకపోవడం పై ప్రతి రోజు సమీక్ష చేస్తూ, వారం వారం ప్రగతి విషయంలో ప్రత్యేక సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. వర్షాల వల్ల, వరదలు కారణంగా ఈ వారం ప్రగతి లో లక్ష్యాలను కారణంగా చూప వద్దని తెలియచేశారు. బేస్మెంట్ నుంచి రూఫ్ లెవెల్, రూఫ్ లెవెల్ నుంచి పూర్తి ఇంటి నిర్మాణం కోసం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవస్యకత ఉందన్నారు. ప్రస్తుతం స్థలాలు పొందిన ప్రతి ఒక్క ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, రానున్న రోజుల్లో అర్హులైన మరి కొందరికి ఇళ్ల పట్టాలు
ఇవ్వనున్న దృష్ట్యా ప్రస్తుత లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఈ ఈ లు సిహెచ్ బాబురావు, జీ. పరశురామ్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *