విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువై డబ్ల్యూ ఓ ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు మోడల్ పరీక్ష నిర్వహించారు. స్థానిక విశ్వ భారతి విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన ఈ మోడల్ పరీక్షకు 330 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా యువై డబ్ల్యూ ఓ రాష్ట్ర అధ్యక్షులు నీలసురేష్ మాట్లాడుతూ టెట్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో ఒత్తిడి నుంచి బయటపడేందుకు మోడల్ పరీక్షలు దోహదపడతాయన్నారు. గడచిన కాలంలో చదువుకున్న సిలబస్‌ను తిరిగి పునశ్చరణ చేసుకోవడం ద్వారా పరీక్షలకు ముందుగా సంసిద్ధులను చేయడానికి తోడ్పడుతుందన్నారు. యువై డబ్ల్యూ ఓ గత తొమ్మిది సంవత్సరాలు నుండి ఇలాంటి మోడల్ పరీక్షలు ఎన్నో నిర్వహించిందని తెలిపారు. ముందుగా టెట్ మోడల్ సంబంధించి ప్రశ్నపత్రాన్ని జంపాన సుధాకర్ పోటీ పరీక్షల నిపుణులు,యువై డబ్ల్యూ ఓ అధ్యక్షులు నీలసురేష్, ఎం హుస్సేన్ డి.ఎస్.ఒ (విజయవాడ) సభ్యులు విడుదల చేశారు.యువై డబ్ల్యూ ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ మోడల్ పరీక్ష కార్యక్రమంలో యువై డబ్ల్యూ ఓ సలహాదారుడు హైకోర్టు న్యాయవాది బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News