Breaking News

డా కె.ఎల్ రావు పార్క్ మరియు స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనులు వేగవంతము చేయాలి

-కొండ ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలి
-46వ డివిజన్ లోని పలు ప్రాంతాలు పరిశీలన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు అధికారులతో కలసి 46వ డివిజన్ పరిధిలోని పలు విధులు మరియు కొండ ప్రాంతాలలో పర్యటించారు. కొండ ప్రాంతములో పర్యటిస్తూ, కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్, మెట్లు, త్రాగునీటి సరఫరా మొదలగునవి సక్రమముగా అందుబాటులో ఉన్నవి లేనివి అడిగితెలుసుకొని, డివిజన్ లో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలని, ఖాళి స్థలములలో గల చెత్త మరియు వ్యర్ధములు తొలగించి స్థానికులు ఎవరు చెత్త మరియు వ్యర్ధములు పడవేయకుండా చూడాలని సూచించారు. డివిజన్ నందలి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దుటతో పాటుగా మెట్ల మార్గంలో గల వాటర్ పైపు లైన్ లను కాంక్రీట్ తో ముసివేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో త్రాగునీటి సరఫరా విధానము మేరుగుపరచుటలో భాగంగా బీమన జానకిరామయ్య వీధి కొండపైన ELSR వాటర్ రిజర్వాయర్ నిర్మించుట కొరకు గుర్తించిన స్థలమును పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.

తదుపరి కె. యల్. రావు పార్కు, స్విమ్మింగ్ పూల్ మరియు ధోభీఖానా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పార్క్ నందు ప్రజలకు అందుబాటులో ఉండేలా షేటిల్ కోర్ట్, స్క్రిటింగ్ మొదలగునవి ఏర్పాటు చేయాలని సూచించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, నరశింహమూర్తి, సిటీ ప్లానర్ జీ.వి ప్రసాద్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *