Breaking News

ఈ నెల 29 నుంచి ఫోటో కార్నివాల్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు నగరంలో ఫోటో కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదల.రమేష్ తెలిపారు. ఇందులో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించేందుకు మూడు వేల మంది ఫోటో గ్రాఫర్స్ ఒకే షాట్ లో ఫోటో తీయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లబ్బీ పేట లోని ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోటో కార్నివాల్ కు సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫోటో గ్రాఫర్ లకు నూతన టెక్నాలజీ పట్ల అవగాహన ఉండడం లేదన్నారు వృత్తి పరంగా వారు వెనకబడిపోతున్నారని తెలిపారు. ఫోటో రంగంలో వస్తున్న సరికొత్త టెక్నాలజీని ఫోటో వీడియో గ్రాఫర్ లకు తెలియజేయాలనే లక్ష్యంతో ఫోటో టెక్ సహకారంతో ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం, విజయవాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలుగు రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫోటో కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బందరు రోడ్డు లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ లో ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఈ కార్నివాల్ జరుగుతుందని వివరించారు. 29 వ తేదీన మంత్రి జోగి రమేష్, ఎంపి నందిగం సురేష్ ఈ కార్నివాల్ నీ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలియజేశారు.30 వ తేదీన మంత్రి ఆర్ కే రోజా ముఖ్య అతిథిగా విచ్చేస్తారని చెప్పారు. ఆరోజు మంత్రి రోజా జాతీయ పతాకాన్ని చేతబూనిన సీన్ నీ ఒకే సారి మూడు వేల మంది ఫోటో గ్రాఫర్ లు ఒకే షాట్ లో ఫోటో క్లిక్ చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేయనున్నారని వివరించారు. తదనంతరం ఫోటో టెక్ సి ఈ వో ఓం ప్రకాష్ మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల కు చెందిన ఫోటో గ్రాఫర్ లతో పాటు కర్ణాటక, గోవా, కేరళ కు చెందిన ఫోటో వీడియో గ్రాఫర్ లు కార్నివాల్ లో పాల్గొంటారని చెప్పారు. విలేకరుల సమావేశంలో విజయవాడ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ యు.కృష్ణ, కోశాధికారి ఎం.సత్యనారాయణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొక్కర.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *