Breaking News

నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టే ప్రతి పని ఆగస్ట్ 9 కి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, మండల విద్య శాఖ, సమన్వయ శాఖల అధికారులతో పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టే నాడు నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత స్కూల్స్ భవనాల్లో చేపట్టవలసిన నాడు నేడు పనులు, అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 629 స్కూల్స్ పరిధిలో ఈపనులు చేపట్టవలసి ఉండగా, వాటికి సంబందించిన రివాల్వింగ్ ఫండ్ సమకూర్చడం లో కొంత నిర్లక్ష్య ధోరణి స్పష్టం గా కనబడు తోందన్నారు. స్కూల్ పేరెంట్ మీటింగ్ సభ్యులతో సమావేశం చేపట్టి వాటికి సభ్యుల ఆమోదం పొందిన తరువాత పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. పది మంది కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాప్యానికి అనవసరపు కారణాలు ఉపేక్షించేది లేదని మాధవీలత స్పష్టం చేశారు. ఇసుక లేదు, ముడి సరుకులు ఇండెంట్ పెట్టాల్సి ఉంది, ఆన్లైన్ లో ఇబ్బందులు పడుతున్నమనే సాకులు చెప్పవద్దనారు. పనులు త్వరితతిన చేపట్టే దిశలో మైక్రో ప్లానింగ్ చెయ్యాలన్నారు. జిల్లాలో పరిధిలో పాఠశాలలో కాలేజీల్లో అంగన్వాడి కేంద్రాల్లో చేపట్టాల్సిన నాడు నేడు పనులు ఆగస్ట్ 9 నాటికి ప్రారంభించక పోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని మాధవి లత హెచ్చరించారు. సూక్ష్మ స్థాయి ప్రణాళికలో నిర్మాణాలు ప్రారంభించే ముందు పరిపాలన ఆమోదం, కమిటీ ఏర్పాటు, వంటి వాటి పై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికీ జిల్లాలో చేపట్టవలసిన నాడు నేడు పనులకి సంబంధించి న పరిపాలన ఆమోదం జరలేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రతిరోజూ ఈపనులపై పర్యవేక్షణ చేస్తున్నారని, ఇందుకోసం వాట్సప్ గ్రూప్ ద్వారా వివిధ జిల్లాల ప్రగతి పై సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి లో నాడు నేడు పనులకు ఇస్తున్న ప్రాధాన్యత మేరకు క్షేత్ర స్థాయి లో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అలక్ష్యం వహిస్తే చర్యలు సంబంధించిన అధికారులు అందరూ వహించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో 629 మంది పాఠశాలలో, 15 జూనియర్ కళాశాలల్లో నాడు నేడు కింద రూ.191 కోట్లతో చేపట్టే పనులకు ప్రతిపాదన చేపట్టి నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డి ఈ ఓ ఎస్. అబ్రహం, డి వి ఈ ఓ సుబ్రహ్మణ్యం, ఎస్ ఈ పిఆర్ ప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ రమేష్, ఎమ్ ఈ ఓ లు, ఇతర మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *