Breaking News

ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ధర్నా…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నయారా ఎనర్జీ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్, ధర్నా చౌక్ సెంటర్లో నిరసన ధర్నాశనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ నయారా యాజమాన్యం డీలర్లకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న మోసపూరిత విధానాల వలన డీలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 400 మంది, భారతదేశంలో అంతట 7500మంది నయారా డీలర్లు ఉన్నారని, రెండు కోట్ల రూపాయలు కంటే మేము ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామని దాదాపు 75 వేల కుటుంబాలు ఈ అవుట్ లెట్ల పై ఆధారపడి ఉన్నాయని ఇప్పుడు నయారా అనుసరిస్తున్న విధానాల కారణంగా కుటుంబాలన్నీ రోడ్డుమీద పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ బంకులతోపాటు సప్లై ఉండాలని, మార్చి నుంచి, జూలై వరకు, నష్టపరిహారం ఇవ్వాలని, ఐదు నుంచి, పది రూపాయలు వరకు, తగ్గించి రైతులును ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నయారా అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.వి నారాయణ, వైస్ ప్రెసిడెంట్ లు, దేవుడు బాబు, పిక్క పూర్ణచంద్రరావు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *