అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రము నందు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రెవిన్యూ వసూళ్లు డా. రజత్ భార్గవ, ఐ.ఎ.ఎస్., రెవిన్యూ (రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్) శాఖ సచివాలయం నందు సమీక్షించారు. ఈ వార్షిక అంతానికి కలిపి రూ.2655.56 కోట్లు జరిగియున్నట్లు తెలియజేశారు.
స్టాంపు డ్యూటీ వసూళ్లు ప్రత్యక విధానము అయిన ‘ఈ-స్టాంపింగ్’ విధానాన్ని ఎస్ హెచ్ సి ఐ లిమిటెడ్ వారు వివరించారు. రాష్ట్రం లో అమలు విధానం సమీక్షించి ఆదేశాలు జారీచేసియున్నారు. ఈ విధానం నందు ప్రక్రియను వారి తరుపున అధికారులు వివరించి యున్నారు. ఇప్పటి వరకు స్టాంప్ డ్యూటీ వసూళ్లు ఎస్ హెచ్ సి ఐ లిమిటెడ్ ద్వారా జరుగుతున్నందున మరియు వసూళ్లు అయిన రిజిస్ట్రేషన్ ఫీజులు సేవ రుసుములు అన్నియు ఎస్ హెచ్ సి ఐ లిమిటెడ్ ద్వారా వసూలు జరుపుటకు ఎస్ హెచ్ సి ఐ లిమిటెడ్ వారు ప్రతిపాదనలు రూపొందించిన వివరాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్షించినారు. ఈ సమీక్ష నందు కమీషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ అయిన వి. రామకృష్ణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News