Breaking News

దేశ భక్తిని ఇనుమడింప చేసిన పింగళి వెంకయ్య…

-కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రను విజయవంతం చేయాలి
-నిత్యావసర ధరల పెరుగుదలపై 5న నిరసన కార్యక్రమము
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకె శైలజనాథ్

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భక్తిని పింగళి వెంకయ్య ఇనుమడింప చేశారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. భారత జాతికి ఆయన చిరస్మరణీయులని, జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య భారత జాతికి చిరస్మరణీయులని అన్నారు. జాతీయ పతాకం రూపుదిద్ది భారతావనిలో దేశభక్తి ఇనుమడింపచేశారని గుర్తు చేశారు. జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతంచేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడని కొనియాడారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి శైలజనాథ్ నివాళులర్పించారు.

అఖండ భారతావని 75 వ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రతి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ కోరారు. మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శైలజనాథ్ కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర దేశ ప్రజలకు తెలియజేసేలా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య సేవలను గుర్తు చేసుకుంటూ 75 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలని, అలాగే ఈ నెల 5వ తేదీన చిద్రమవుతున్న సామాన్యుడి జీవన స్థితిగతులు నిత్యావసర ధరల పెరుగుదల, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలియజేశారు. అలాగే అదే రోజు దేశంలో నియంత పాలనకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు మోడీ ఇంటి వద్ద నిరసన తెలియ చేస్తారని, దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ సంపదను అంబానీ, ఆదానిలకు దోచి పెడుతున్నాడని శైలజనాథ్ విమర్శించారు.

అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పన్నుల భారంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదని, మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని సుధాకర్ బాబు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సి మోహన్ రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, సీనియర్ నాయకుడు కె పెద్దారెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్, కె లక్ష్మీనారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శులు దామోదరం రాధాకృష్ణ, ఎస్ బాబు రావు, ఖాసిం వలి, డీఎస్ భాష, నందికొట్కూరు కాంగ్రెస్ నాయకులు సి అశోకరత్నం, పీసీసీ స్పోక్స్ పర్సన్ ఏ కరుణాకర్ బాబు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్, కిసాన్ సెల్ అధ్యక్షులు పోతుల శేఖర్, బీసీ సెల్ చైర్మన్ బోయ మద్దిలేటి, జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ చైర్మన్ మహమూద్ నూర్ , డాక్టర్ సెల్ అమరేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు, యస్ ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు యస్. శివానంద్, ఖాజాహుసేన్, హరికుమార్, రియాజ్ బాషా, ఐఎన్టీయూసీ నాయకులు ఎం సుంకన్న, గోవిందు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఎస్. సారమ్మ, ఎస్ ప్రమీల, మద్దమ్మ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *