అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంచార జాతులకు చెందిన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఫించన్లు ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రంజిత్ భార్గవ్ ను రాష్ట్ర సంచారజాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న కలుసుకుని కోరారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ఆయన రంజిత్ భార్గవ్ ను కలిసి రాష్ట్రంలో బిసి జాబితాలోని సంచార, అర్ధసంచార విముక్తి జాతుల, ఎంబిసిలుగా ఉన్న 32 కులాల వారు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతూ సంస్కృతి సాంప్రాదాయలను కొనసాగిస్తూ కళాకారులు కళలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వీరిని గుర్తించి గుర్తింపు కార్డులు, అర్హత గల వారికి పెన్షన్లు ఇవ్వాలని పెండ్ర వీరన్న విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ విషయాలు పరిశీలించి త్వరలోనే వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని రంజిత్ భార్గవ్ అన్నారు. వారితో పర్యాటక, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు ఉన్నారు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మిని కలిసిన పెండ్ర వీరన్న…
సంచార జాతుల్లోని కళాకా రులకు గుర్తింపు కార్డు లిచ్చి, అర్హత కలిగిన వారికి పింఛన్ అందజేయాలని మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు. అత్యంత వెనుకబడిన 32 సంచార జాతులు వివిధ కళ లను ప్రదర్శిస్తూ.. భిక్షాటన చేసుకుంటున్నా యని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా.. విద్య, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గుర్తింపు కార్డులతో పాటు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని రాష్ట్ర సంచారజాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్నకోరారు.
Prajavartha Online Telugu News