Breaking News

టిటిడి బోర్డు చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి మర్యాదపూర్వకంగా మాగల్లు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆలయ పండితులు కలిశారు. విజయవాడ నగరంలో టిటిడి బోర్డు చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని ఆయన కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి నందిగామ మండలం లోని మాగల్లు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆలయ పండితులు అంగర రాంబాబు మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల మాగల్లు గ్రామ సమీపంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ అష్టలక్ష్మి పౌండరీక మహా యాగానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సమయంలో మాగల్లు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని – ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వై వి సుబ్బారెడ్డి  హామీ ఇచ్చిన పిమ్మట – ఆలయ ప్రాంగణ అభివృద్ధికి సొంత నిధులు కేటాయిస్తానని , ఆ బాధ్యతను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కి అప్పగిస్తున్నట్లు  వై.వి సుబ్బారెడ్డి  హామీ ఇచ్చారు , అనంతరం నందిగామ నియోజకవర్గంలోని కొన్ని దేవాలయాల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గాదెల వెంకటేశ్వరరావు(బాబు), కమిటీ సభ్యులు చెరుకూరి హైమారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *