విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జక్కంపూడి గ్రామ రైతుల భూ సేకరణకు సంబంధించి పరిహారం చెల్లించే విషయంలో తగు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేధించడం జరుగుతుందని రైతులు కూడా ప్రభుత్వానికి సహకారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
విజయవాడ నుండి కొండపల్లి రైల్వే లైన్ మార్గంలో కొత్తగా నిర్మించే మూడవ రైల్వే లైన్ నిర్మాణం కోసం జక్కంపూడి వద్ద భూ సేకరణకు సంబంధించి రైతులు, రెవెన్యూ, రైల్వే అధికారులతో శనివారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిఆర్వో కె.మోహన్ కుమార్, సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నిర్మించే రైల్వే లైన్ నిర్మాణం కోసం జక్కంపూడి గ్రామం వద్ద ఎకరం 80 సెంట్ల భూమి సేకరించవలసి ఉందని ఇందుకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు నష్టపరిహార విషయంలో వారి అభిప్రాయాలను పరిగనలోకి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తానని కలెక్టర్ అన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వారు సంతృప్తి చెందేలా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరితగతిన జక్కంపూడి రైతులు ప్రాజెక్టుకు అవసరమైన భూములను ఇస్తే మూడవ రైల్వే లైన్ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి అయి ఈ ప్రాంతం మరింత అభివృద్ధిలోకి వస్తుందన్నారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుందని రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
సమావేశంలో విజయవాడ రూరల్ తహాశీల్థార్ శ్రీనివాస్ నాయక్, సౌత్ సెంట్రల్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీయర్ బి. తిమోతి, జక్కంపూడి రైతు దేవినేని పరమేశ్వరరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ యం. దుర్గప్రసాద్, విజయవాడ డివిజన్ భూ సేకరణ విభాగ డిప్యూటి తహాశీల్థార్ రాజేష్ ఉన్నారు.
Prajavartha Online Telugu News