Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి ఐదు లక్షల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జెమ్‌ గ్రానైట్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్‌ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఆర్‌.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *