Breaking News

గుంటూరు శ్రీ చక్రాలయంలో శ్రీ చండి మహా యాగం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశం లో తొలిసారిగా 23 కోట్ల శ్రీ విద్యా బీజాక్షరములను క్షిప్తం చేయబడి గుంటూరు నల్లపాడు రోడ్డు సాయినగర్ 3వ లైన్ లో 20 అడుగుల ఎత్తులో నిర్మించిన స్ధూపం పై రెండు అడుగుల శ్రీచక్రం ప్రతిష్టంచబడిన శ్రీ చక్రాలయం లో ఆదివారం ఉదయం “శ్రీ చండీ మహాయాగం” జరిగింది.ఇక్కడ నూతనంగా ప్రారంభించబడిన నిర్మాణాలలో శ్రీ చక్ర కళ్యాణ వైభవ మందిరం రెండు శ్లాబులతో నిరాటంకంగా పూర్తయిన నేపధ్యంలో లోకకళ్యాణార్ధం కార్రకమం నిర్వహించడం జరిగిందని ముఖ్య సారధి…ఆలయ సర్వాధికార ప్రతినిధి శ్రీ వశిష్ఠ ఆశ్రమ దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ విశ్వంభరానందగిరి స్వామి వారు తెలిపారు.
శ్రీ వశిష్ఠ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ ప్రణవానందగిరి స్వామి వారి పర్యవేక్షణ లో జరిగిన ఈ మహత్తర కార్యక్రమం లో కృష్ణా జిల్లా పెదపులిపాక శ్రీ విజయ రాజరాజేశ్వరి, శ్రీ విద్యా పీఠాధిపతులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామి, పురాణ దంపతులు శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ దంపతులు,ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కొమ్మన నరసింహారావు గారు,విశ్రాంత మెడికల్ ఆఫీసర్ డా.సజ్జా లీలావతి (చీరాల) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *