Breaking News

ప్రజాస్వామ్యనికే సిగ్గుచేటు… : ఎం.యస్. బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నారా చంద్రబాబు, నారా లోకేష్ ల పర్యటనలను అడ్డుకుంటూ సంబరాలు చేసుకుంటున్న వై.సి.పి. సర్కారుకు రాబోయే ఎన్నికల్లో గట్టి పతనం తప్పదని తెదేపా రాష్ట్ర నేత ఎం.ఎస్. బేగ్ జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రలో లోకేశ్. పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటు. స్వేచ్ఛగా జీవించే హక్కుని ఈ వై.ఎస్.ఆర్. సర్కారు హరిస్తోంది. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతవణిలో ఇంతటి గడ్డు స్థితి బ్రిటీష్ జమానాలోనూ లేదు. నిజంగా సర్కారులో నీతి, నిజాయితీ, మానవతా విలువలు ఉన్నట్లయితే… వివక్షాల పర్యటనలకు అడ్డంకులు ఎందుకని ప్రశ్నిస్తున్నాను. ఇకనైనా జగన్ రెడ్డి సర్కారు పంతాలు, పట్టింపులు, ఇగోలను వదిలి, ప్రజా సంక్షేమానికి పాటుపడాలని, లేకుంటే తెదేపా శ్రేణుల పర్యటనలు వెల్లువలా కొనసాగుతునే ఉంటాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *