విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పంచాయతీ అధికారి(ఇన్‌చార్జ్)గా నియమితులైన జె.సునీత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును కలిసి జాయినింగ్ రిపోర్టును అందజేశారు.ఎన్‌టిఆర్ జిల్లా పంచాయతీ అధికారి (ఇన్‌చార్జ్)గా జె. సునీతను నియమిస్తు జిల్లాకలెక్టర్ ఎస్ డిల్లీరావు ఉత్తర్వులు ఇచ్చారు. డివిజనల్ స్థాయి డెవలప్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జె. సునీత ప్రస్తుతం డ్వామా జిల్లా పాజెక్టు డైరెక్టర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. ఆమెకు జిల్లా పంచాయతీ అధికారి(ఇన్‌చార్జ్)గా అదనపు భాధ్యతను అప్పగిస్తు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మిదుర్గ నుండి సోమవారం జె.సునీత పదవీ భాధ్యతను స్వీకరించారు.
Prajavartha Online Telugu News