Breaking News

90 రోజులలో పూర్తి చేసేలా ఆధార్‌ నెంబన్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ నెంబన్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను 90 రోజులలో పూర్తి చేసేలా బూత్‌ స్థాయి అధికారుల సమన్వయంతో కార్యచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నకిలీ ఓట్లను అరికట్టడం బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు తొలగింపు వివరాల దిద్దుబాటు, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. బూత్‌ స్థాయి అధికారులు రోజుకు 10 నుండి 12 ఓటర్‌ గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విధంగా చేపట్టి 90 రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని మన జిల్లాలో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.జిల్లాలో ఇప్పటికే 99 శాతం పైగా ప్రతి పౌరుడూ ఆధార్‌ గుర్తింపు కార్డులు పొందడం జరిగిందని ఇంకనూ ఎవరైనా ఆధార్‌ గుర్తింపు కార్డులేని పక్షంలో ఓటర్‌ గుర్తింపు కార్డుకు అనుసంధానంలో ప్రత్యామ్నాయంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాబ్‌కార్డు, ఫోటోతో కూడిన పోస్టాఫీస్‌ బ్యాంక్‌ పాస్‌బుక్‌, ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పాన్‌ కార్డు ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫోటోగ్రాఫ్‌ సర్వీస్‌ ఐడెంటిటి కారుఓష్ట్ర్డ విత్‌ ఫోటోగ్రాఫ్‌ అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు యూనిక్‌ ఐడెంటిటీ కార్డు మొదలైన పది రకాల గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఈ ఆధార్‌ అనుసంధాన ప్రక్రియద్వారా ఓటర్లుతమ పేర్లలో కుటుంబ సభ్యుల పేర్లలో వయస్సులో చిరునామాలో తేడాలు ఉంటే సరిచేసుకోవాలని ఈ అవకాశాలన్ని జిల్లాలోని ఓటర్లు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ డిపివో ఇన్‌చార్జ్‌ జె.సునీత, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను, కలెక్టర్‌ ఏఓఇంతియాజ్‌ పాషా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *