Breaking News

ప్రజా ఆశీర్వాదంతో మరలా జగనన్ననే ముఖ్యమంత్రి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పధకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయనే మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉంటారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 109 సచివాలయం ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ పథకాలు వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పర్యటనలో మా వైస్సార్సీపీ నాయకులు ప్రజల్లోకి వస్తుంటే మహిళలు, వృద్దులు, పిల్లలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్నారని,వైసీపీ పాలన పట్ల వారు ఎంత సంతృప్తి గా వున్నారు అనేదానికి ఇదే నిదర్శనం అని అన్నారు.రోడ్డు మీద నడుస్తుంటే ఆటోవాలలు,చిరు వ్యాపారులు జగన్ గారికి మద్దతు తెలుపుతూన్నరని అన్నారు.ప్రజల్లో ప్రభుత్వం పట్ల అంత సానుకూలత ఉంటే టీడీపీ నాయకులు ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని ఎద్దేవా చేసారు. జాతీయ సర్వే సంస్థలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అని చెబుతుంటే తట్టుకోలేక పనికిమాలిన వ్యక్తులతో ఫేక్ సర్వేలతో మభ్య పెట్టాలని చూస్తున్నారు అని విమర్శించారు. మీకు నిజంగా అంత నమ్మకం,దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యే లతో రాజీనామా చేపించి ఎన్నికలకు వెళదామా అని సవాలు విసిరారు. విజయవాడ ఎంపి ని వారి పార్టీ నాయకులే అంగీకరించే పరిస్థితులు లేవని ఆ ఫ్రేస్టేషన్ లో జగన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూన్నారని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన చిల్లర వేషాలతో, డ్రామా రాజకీయాలతో ప్రజలలో చులకన అయ్యారని వారిని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో, అనుకూల మీడియాలలో ఫేక్ వీడియో లు ప్రచారం చేసుకొనే పరిస్థితి కి టీడీపీ దిగజారిపోయింది అని అన్నారు. వైస్సార్సీపీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని,సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి,గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజులుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *