Breaking News

జాతీయ రహదార్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్లు భవనాల శాఖ మరియు జాతీయ రహదార్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 16 జాతీయ రహదార్లలో మరియు ఆర్‌అండ్‌బి శాఖలు చేపట్టిన వివిధ ప్రాజెక్టు నిర్మాణ పనులపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆర్‌డివోలు తహాశీల్థార్లు, భూ సేకరణ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో విస్తరించనున్న జాతీయ రహదార్లలోని గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్లు ప్రాజెక్టులను, విజయవాడ, గుడివాడ, భీమవరం, నరసాపురం రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి గుణదలలోని 13 సెంట్లు స్థల సేకరణ అంశంపై, ప్రిలిమినరీ నోటిఫికేషన్‌, గొల్లపూడి` జక్కంపూడి రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణకు అవార్డు పాస్‌ పై జగ్గయ్యపేటలోని కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ టర్మినల్‌ సెంట్రల్‌ ప్రాజెక్టకు సంబంధించి అవసరమైన 7 ఎకరాల 57 సెంట్లు భూమికి మూడు వారాలలో అవార్డ్‌ పాస్‌ చేయించాలని నందిగామ ఆర్‌డివోను ఆదేశించారు. భవానిపురంలో ఆర్‌అండ్‌బి ఏ సర్వీస్‌ రోడ్డు సంబంధించి పియన్‌ నోటిఫికేషన్‌ ప్రపోజల్‌ పబ్లిష్‌ కావాలన్నారు. మైలవరం మండలంలోని వెల్వడం` చంద్రాల గ్రామాలోని రహదారి విస్తరణ పనులను రానున్న మాసాంతరానికి అవార్డ్స్‌ పాస్‌ చేయించాలన్నారు. ఏ కొండూరు మండలంలోని విజయవాడ` భద్రాచలం రోడ్డు విస్తరణకు సంబంధించి నేషనల్‌ హైవే 30కి సంబంధించి చీమలపాడు గ్రామంలో అవార్డు పాస్‌ చేయించాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో నందిగామ ఆర్‌డివో రవింద్ర, తిరువూరు ఆర్‌డివో లక్ష్మిప్రసన్న, ఆయా మండలాల తహాశీల్థార్లు, జాతీయ రహదార్ల అధికారులు ఆర్‌అండ్‌బి అధికారులు భూ సేకరణ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *