Breaking News

భారతదేశం నేడు ప్రత్యేకంగా డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి అగ్రగామి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“భారతదేశం నేడు ప్రత్యేకంగా డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి అగ్రగామిగా నిలిచింది. ప్రజల జీవితాలను, పాలనను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడంలో అగ్రశ్రేణి దేశంగా అవతరిస్తోంది. భారతదేశ స్టాక్ మార్కెట్, ప్రభుత్వపు ఇతర వివిధ డిజిటల్ పరిష్కారాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను అసూయపరుస్తున్నాయి. భారతదేశం ప్రపంచ  డిజిటల్‌ వ్యవస్థకు నాయకత్వం వహిస్తుంది. డిజిటల్‌ వ్యవస్థ   ఇండియా ని నడిపించడంలో ఇండియా డిజిటల్ వ్యవస్థని నడిపించడంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ధన్యవాదాలు” అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాలభివృద్ధి పారిశ్రామికత  శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విజయవంతమైన డిజిటల్ చెల్లింపులు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) గురించి మాట్లాడుతూ అన్నారు. 2013 నుండి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రూ.24.8 కోట్లకు పైగా బదిలీ చేయబడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఇది రూ.6.3 లక్షల కోట్లు. అంటే రోజుకు సగటున 90 లక్షలకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయి. ప్రధానమంత్రి రైతు ఆదాయ మద్దతు పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.20,000 కోట్లు బదిలీ చేశారు. (అంటే ఇది ఒకే రోజులో ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా 10 కోట్లకు పైగా లావాదేవీలు జరగడం) 2021-22 సంవత్సరంలోనే 8,840 కోట్లకు పైగా డిజిటల్ మనీ లావాదేవీలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3,300 కోట్లు.(24 జూలై 2022 వరకు), రోజుకు సగటున 28.4 కోట్ల డిజిటల్ మనీ లావాదేవీలు జరిగాయి. డిజిటల్ రంగంలో పెట్టుబడులు (డిబిటి, జె.ఎ.ఎం ట్రినిటీ, ఎన్.పి.సి.ఐ మొదలైనవి) భారతదేశ విజయానికి ఉదాహరణ. ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాలే కాకుండా ‘అభివృద్ధి చెందిన’ దేశాలు కూడా దీని నుండి నేర్చుకోవచ్చు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *