Breaking News

ఆత్మ విశ్వాసం వుంటే ఏదైనా సాధించవచ్చు

-రవి వర్మ విశాఖకు గర్వకారణం
-ఆయన స్ఫూర్తితో వికలాంగులు విజయాలు సాధించాలి
-రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి అమర్ నాథ్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆత్మ విశ్వాసం వుంటే ఏదైనా సాధించవచ్చు అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖకు చెందిన వైసిపి నాయకులు బి ఎన్ రాజు కుమారుడు రవి వర్మ కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంలో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. అయినా మనో నిబ్బరం కోల్పోకుండా, వీల్ చైర్ మీద 27 వేల కిలోమీటర్లు, దేశంలోని 28 రాష్ట్రాలలో తిరిగి, మార్గమధ్యంలో దివ్యాంగులను కలుసుకొని వారిలో స్ఫూర్తి నింపాడు. రెగ్యులర్ యాక్సిస్ ఫర్ మొబిలిటి సంస్థ (ర్యాంప్) స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన ఇప్పటికీ వికలాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దేశవ్యాప్త పర్యటనను ముగించుకుని వచ్చిన రవి వర్మ ను స్థానిక బీచ్ రోడ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి అమర్నాథ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ వీల్ చైర్ మీద దేశవ్యాప్త పర్యటన చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. అన్నీ ఉండి దేనికి ప్రయత్నించండి వాళ్ళు వికలాంగులతో సమానమని, అంగవైకల్యం ఉన్నప్పటికీ ఇంతటి సాహస ప్రయాణం చేసిన రవి వర్మ వికలాంగుడు ఎలా అవుతాడు అని ఆయన ప్రశ్నించారు. ఆయన పట్ల జాలి చూపించకుండా ఆయన స్ఫూర్తిని అందరికీ తెలియజేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఏకుటుంబంలో అయినా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారన్న విషయం తనకు తెలియదని మంత్రి అమర్ నాథ్ అన్నారు. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని అయినప్పటికీ నా తల్లి నాకు ఇచ్చిన స్ఫూర్తితో ఇంతటి వాడిని అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. రవి వర్మ దేశ పర్యటనకు తాను ప్రోత్సహించానని అన్నారు. మార్గమధ్యంలో ఉత్తరాఖండ్లో రవి వర్మ కు హెలికాప్టర్ అవసరం ఏర్పడినప్పుడు తాను సంబంధిత అధికారులతో చర్చించి దానిని ఏర్పాటు చేశానని అమర్నాథ్ తెలియజేశారు. రవి వర్మ దేశవ్యాప్త పర్యటన లో ఆయనకు సహాయకుడిగా పనిచేసిన ఆయన డ్రైవర్ సతీష్ని కూడా ఆయన అభినందించారు. దివ్యాంగులు వీల్ చైర్ మీద దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు లేఖలు రాస్తానని, అలాగే ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అమర్ నాథ్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి రవి వర్మ తండ్రి, ర్యాంపు పౌండేషన్ చైర్మన్ బి.ఎన్.రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తన కుమారుడు ప్రమాదానికి గురైన వెంటనే తాను పూర్తిగా నిరాశా, నిస్పృహలకు గురయ్యానని కానీ తన కుమారుడు తనకు ధైర్యం చెప్పి నెట్లో మగ్గుతున్న వికలాంగులకు ధైర్యం చెప్పి వారిని వెలుగులోకి తీసుకు వస్తానని దేశ పర్యటనకు వెళ్లాడని అన్నారు.తన కుమారునికి మంత్రి అమర్నాథ్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి నందుకు రాజు ధన్యవాదాలు తెలియజేశారు.
ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ రవి వర్మ అనేకమంది వికలాంగులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కె.కె.రాజు మాట్లాడుతూ, రవి వర్మ దేశ పర్యటనకు వెళ్లినప్పుడు మేమంతా భయపడ్డామినీ, వర్మ మాకు ధైర్యం చెప్పి ముందుకు సాగారని అన్నారు. కమీషనర్ లక్ష్మీస మాట్లాడుతూ వర్మ ప్రమాదం జరిగిన తరువాత ఆయన కుటుంబం ఎంత ఆందోళన చెందిందో ఊహించ గలమనీ అన్నారు.రవి వర్మ రోడ్డు ప్రమాదాలపై జనానికి అవగాహన కల్పించి ప్రపంచానికి మంచి సందేశం అందించాలని ఆయన అన్నారు. వర్మ ఆశయం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ మనోనిగ్రహంతో రవివర్మ వీల్ చైర్ మీద దేశ పర్యటన చేయడం ముదావహం అని అన్నారు. ఆయన జీవితం హాయిగా సాగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్మ మరింత ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వైకల్యం శరీరానికి కాని, మనసుకు కాదని వర్మ నిరూపించారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, సంకల్పం వుంటే ఏదైనా సాధించ వచ్చని నిరూపించిన వ్యక్తి వర్మ అని అన్నారు. మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ రవి వర్మ ప్రమాదం జరిగిన తరువాత కూడా నిరాశకు గురికాకుండా, ఆత్మ నిబ్బరంతో ముందుకు సాగారని అన్నారు. వర్మ సోదరి మాట్లాడుతూ మన పని మనం చేసుకోగలమినీ వీల్ చైర్ మీద, కార్ మీద 28 రాష్ట్రాలు తిరిగివచ్చి వర్మ నిరూపించాడని అన్నారు. టూరిజం ప్రాంతాల్లో, దేవాలయాల్లో వీల్ చైర్ పర్సన్స్ కి సులభంగా ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి ,డిప్యూటీ మేయర్ శ్రీధర్, కార్పొరేట్ బాణాల శ్రీనివాస్, వై.సి.పి. నాయకులు సతీష్ వర్మ, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *