విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 21 డివిజన్ లో ప్రభుత్వ భూములు హుడా భూములు ఇరిగేషన్ భూములు కార్పొరేషన్ స్థలాలు కబ్జాకి గురి అవుతుంటే దానిని రక్షించవలసినటువంటి వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు సూచించికపోవడం అనేక అనుమానాలకి తావిస్తోంది కజ్జాకి గురి చేసేటువంటి కబ్జా చేసేటువంటి స్థలాల్ని దొంగిలించి అమ్మకాలు చేసేటువంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్లు పెట్టి వారిపైన న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజనం నిర్మాణాలు తక్షణమే చేపట్టాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలుగు మహిళ సెంట్రల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లబ్బ దుర్గాలు డిమాండ్ చేశారు
బుధవారం 63వ డివిజన్ పరిధిలోని న్యూ రాజీవ్ నగర్ లో కబ్జా కి గురైనటువంటి 1120 గజాలు స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేసుకుని ప్లాట్లు రూపంలోఅమ్మకం చేసినటువంటి స్థలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ స్థలాన్ని కాపాడాలని ప్రజల ప్రయోజనార్థం తక్షణమే నిర్మాణాలు చేపట్టాలని నిరసనదర్న నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు లబ్బ దుర్గాలు మాట్లాడుతూ ఆనాడు ఉడావారు కార్పొరేషన్ వారు నగర శివారు ప్రాంతమైనటువంటి పేద ప్రజానీకం నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాలు ఉంచడం జరిగింది. దానిలో పార్కుల నిర్మాణం కమ్యూనిటీ హాల్న నిర్మాణం కళ్యాణ మండపాల నిర్మాణం ఇతర ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా ప్రయోజనాలు నిమిత్తం నిర్మాణాలు చేపట్టి భవిష్యత్తులో వారందరికీ కూడా అందించాలని ఇటువంటి భావనతో ఉంచినటువంటి ప్రభుత్వ భూములు ఈనాడు ఆక్రమణలకు గురవుతున్నాయి దీనికి అధికారపక్షమైనటువంటి వైసీపీ ప్రభుత్వం వహించదా స్థానిక ఎమ్మెల్యే కబ్జాలు గురికాకుండా దీనిమీద పర్యవేక్షణ చేయవలసిందిగా ఆయన మీద లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కబ్జాకి గురవుతుంటే దాని నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా కబ్జాదారులకు సహకరించి భాగస్వామి అవుతున్నారో ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ ప్రాంత ప్రయోజనాలు ఆ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడుతున్న చలనమ్ లేనటువంటి పరిస్థితుల్లో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు గారి చొరవతో అటు మున్సిపల్ కమిషనర్ తో పోలీస్ శాఖ వారితో మాట్లాడి ఆ ప్రాంతాల్ని కబ్జా కాకుండా నిలుపుదల చేయడం జరిగింది సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధానంగా 63వ డివిజన్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతంలో ఇది కార్పొరేషన్ స్థలం ప్రభుత్వ స్థలం ఆక్రమణ చేస్తే చర్యలు తీసుకుంటామని ఈనాడు బోర్డు పెట్టినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? వైసిపి ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు వారికి సహకరిస్తున్నారా లేదంటే ప్రజలకు కట్టబెట్టవలసినటువంటి ప్రజ ప్రయోజనాలు కాపాడేటువంటి ఆ స్థలంలో రక్షిస్తున్నారు ఒకసారి ప్రజలకి వివరణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ప్రజా పక్షాన్ని ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో నగరంలో ఉన్నటువంటి అది ఉడా భూముల కార్పొరేషన్ భూముల ఇరిగేషన్ భూముల ప్రభుత్వ భూములనే రక్షించి భవిష్యత్తు ప్రజలకు ఇవ్వటానికి సాయి శక్తుల బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం లో జరుగుతుంది ఆనాడు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గం కమిటీ హాలు సామాజిక భవనాలు ప్రాథమిక వైద్యశాలు పార్కులు నిర్మింపజేసి భవిష్యత్తు తరాలకి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి నిర్మాణాలు చేపట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిగిలినటువంటి భూముల్లో ఈనాడు పాలన సాగిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకని మూడు సంవత్సరాల కాలంలో నిర్మాణాలు చేపట్టలేదు ఎందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ప్రజలకు అందించాలని భవిష్యత్ తరాలకు ఇవ్వాలని ఒక ప్రణాళిక బద్ధంగా రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది తక్షణమే మున్సిపల్ అధికారులు ఇటువంటి స్థలాలు మీద దృష్టి కేంద్రీకరించాలని ఎవరు కబ్జా చేస్తున్న వారిపైన చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్లు కట్టి వారిని శిక్షించాలి అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ఇటువంటి కబ్జాదారుల మీద చర్యలు తీసుకున్నటువంటి విధంగా ఎఫ్ఐఆర్లు వారి పేరుతోనే నమోదు చేసి వారికి జైలుకు పంపించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటివి పునవృత్తం కాకుండా చూడాలి అని హెచ్చరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో 63 డివిజన్ ఇంచార్జి బత్తుల కొండ, అధ్యక్షులు లబ్బా వైకుంఠం ,సెక్రెటరీ కోలా శ్రీను, బెజ్జం జయపాల్,మోతుకురి కాసిమ్,కోలా దుర్గారావు,పట్టిమ రమణ,j పాపలు ,మెహర్ ,పెద్ద బాజి,జానీ బాషా, బచ్చ , పెద్ది శ్రీను,భవాని,రమేష్,శివ,అనీఫ్, ఆరీఫ్, L సాయి,కిరణ్, గరిమెళ్ళ చిన్న,మురళి కృష్ణం రాజు,అయ్యప్ప, మని,అన్వర్,గౌస్ బాషా,ఆవుల మంద మారుతి,భవాని శెంకర్ ,kvr ,వలి, శివ ,రమణ,ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…
Prajavartha Online Telugu News