Breaking News

ఫారం 6 బి లో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
స్వచ్చందంగా ఆధార్‌ – ఓటర్‌ కార్డుకు అనుసందానంపై ప్రత్యేకంగా రూపొందించిన ఫారం 6 బి లో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, బూత్‌ లెవల్‌ అధికారులను ఆదేశించారు.
స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఓటర్ల జాబితాకు ఆధార్‌ అనుసందానం, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులకు ఉద్దేశించిన వివిధ ఫారాలపై బూత్‌ స్థాయి అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో భాగంగా 17 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఇప్పటికే నమోదు అయిన వారు ఆధార్‌ అనుసందానం చేయాల్సి వుంటుందన్నారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదు అయిన ఓటర్లు ఆధార్‌ నంబరును తెలపాల్సివుంటుందని అయితే ఇది పూర్తిగా స్వచ్చందమని, ఆధార్‌ నెంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం జరగదనే విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఆధార్‌ సంఖ్యను అనుసందానించేందుకు ఎన్నికల సంఘం ఫారం 6 బి ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందన్నారు. గరుడ యాప్‌, ఎన్‌విఎస్‌పి, ఓటర్‌ పోర్టల్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, వంటి అన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలలో ధరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. రోజుకు 20 చొప్పున బూత్‌ స్థాయి అధికారి ఓటర్‌ జాబితాలో ఉన్న వారి ఆధార్‌ నంబరును సేకరించాలని, సేకరించిన ఫారాలను స్టాంగ్‌ రూమ్‌లో భద్రపరచాలన్నారు. వివరాలు సేకరించిన ఫారం 6 బి పై ఓటర్‌ సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆధార్‌ను ఇవ్వకుంటే దానికి బదులుగా ఫారం 6 బి ధరఖాస్తులో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలలో ఎదో ఒకటి అనగా ఉపాధిహామి పథకం జాబ్‌కార్డు, లేదా బ్యాంకు పోస్టుఆఫీస్‌ జారీ చేసిన ఫోటోగ్రాఫ్‌తో కూడిన పాస్‌ బుక్‌, కార్మిక మంత్రుత్వ శాఖ జారీ చేసిన ఆర్యోగ భీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెస్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఫోటోగ్రాఫ్‌తో కూడిన పెన్షన్‌ పత్రం తదితర పత్రాలను సమర్పించవచ్చునని కలెక్టర్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 9వ తేదిన స్పెషల్‌ సమరీ రివిజన్‌, జనవరి 5వ తేదిన ఓటర్ల జాబితా ఫైనల్‌ పబ్లికేషన్‌ ఉంటుందని ఇలోగా ఓటర్ల జాబితాకు ఆధార్‌ అనుసందానం పూర్తి కావాలన్నారు. త్వరలో రేషన్‌నైలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నదని దీని ద్వారా కుటుంబంలోని ఓటర్లలందరు ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో ఓట్లు వేసే విధంగాను, పోలింగ్‌ స్టేషన్‌ సరిహద్దులలో మార్పులు చేర్పులు వంటి వాటిని సులభతరం చేసేలా కొత్త విధానం రానున్నదన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఓటర్ల జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలపై బూత్‌ లెవల్‌ అధికారులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
అవగాహన కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్లు శ్యామల, సత్యవతి, జిల్లాలోని బూత్‌ లెవల్‌ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *