-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
-గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా.. 8వ డివిజన్ సచివాలయం-3 పరిధిలోని శంకరాపురంలో పర్యటన
కడప, నేటి పత్రిక ప్రజా వార్త :
కడప, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే.. రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ సచివాలయం1 నుండి 3వ సచివాలయం పరిధిలోని శంకరాపురం అంథుల పాఠశాల నుండి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి.. స్థానిక కార్పొరేటర్, అధికారులతో కలిసి.. ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి.. ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు. పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా.. పలువురు తమ సమస్యలను అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు రెఫర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కార్యక్రమంలో… ప్రతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై లబ్దిదారుల మనోభావాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు వైకాపా నాయకులు సుభాన్ భాష, బంగారు నాగయ్య, రాణా ప్రతాప్, 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి దేవి, డివిజన్ ఇంచార్జి బాలకృష్ణా రెడ్డి, డా. సోహైల్, పలువురు నగర కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News