విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలు నుండి ట్రస్టు తరఫున అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ,ప్రజలకు దేవినేని నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన కోరే చిన్న,తోకల దుర్గ అద్దె బండులతో ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి రాగా నేడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 30000 రూపాయల విలువ గల తోపుడు బండ్లు మరియు వైయన్ఆర్ చారిటీస్ ద్వారా యలమంచిలి జయ ప్రకాశ్ అందించిన 25,000 విలువ గల బడ్డి కొట్టును శీలం మంగేశ్వరరావు జీవనోపాధి నిమిత్తం అవినాష్ అందజేశారు.అదేవిధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ ఫకీర్ గూడెం లో పర్యటించినప్పుడు అబ్దుల్ ఖలిమ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి నేడు వారికి వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్,2వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, వైస్సార్సీపీ నాయకులు ఉకోటి రమేష్ విజయ్, యలమంద, సాంబశివరావు, హనాన్, ప్రకాష్, చంటి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News