Breaking News

దివ్యంగులకు అండగా జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా 98 శాతం హామీలు అమలు చేయడంతో పాటు,దివ్యంగులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం నందు ఆంద్రప్రదేశ్ వీర వసంత దివ్యంగుల సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పధకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం అవయవ లోపంతో బాధపడుతున్న దివ్యంగులకు పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో వారికి పెద్దపీట వేస్తున్నారు అని అన్నారు.దివ్యంగుల మూడు ప్రధాన కోరికలు అయిన ప్రత్యేక విభాగం,పదోన్నతులు లలో 4శాతం రిజర్వేషన్లు, అదేవిధంగా వారు పెళ్లి చేసుకొంటే లక్షన్నర పెళ్లి కానుక ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం హర్షణీయం అని అన్నారు.రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండి మరోసారి ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి కృషి చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీర వసంత దివ్యంగుల సంక్షేమ సంఘం రాష్ట్రా అధ్యక్షులు మల్లెల లక్ష్మీ నారాయణ మరియు సంఘం నాయకులూ, దివ్యంగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *