Breaking News

సెప్టంబరు 22 న కేంద్ర మంత్రి నితిని గడ్కరి పర్యటన

-పర్యటన ఏర్పాట్లు పై చర్చించిన కలెక్టరు, పార్లమెంట్ సభ్యులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజమహేంద్రవరం లోని మోరంపూడి జంక్షన్ వద్ద పై వంతెన పనులకు శంఖుస్థాపన చేయుటకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిని గడ్కరి రానున్నారని, ఇందుకు సంబందించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరు ఛాంబర్ జాతీ రహదారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్విహంచారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లును చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల అధికారులు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు పరస్పరం సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పర్యటన సందర్బంగా పూర్తి స్థాయిలో బందోబస్తు, ప్లైఓవర్ శంఖుస్థాపన ఏర్పాట్లు తదితర కార్యక్రమాలకు సంబందించి కార్యాచరణ సిద్దం చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజమండ్రి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 5 పై వంతెన పనులను రూ.130కోట్లతో ప్రతిపాధించడం జరిగిందని ఈ పనులను త్వరలో కేంద్ర మంత్రి ద్వారా ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 22 న మోరంపూడి పై వంతెన పనులకు శంఖుస్థాపన కేంద్ర మంత్రి స్వయంగా రావడం జరుగుతుందన్నారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకొని విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మోరంపూడి సంబందించిన సమగ్ర ప్రోజెక్టు ప్రతిపాధనలకు ఆమోదం లభించిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషన్నర్ కె. దినేష్ కుమార్, జాతీయ రహదారుల రీజనల్ అధికారులు ఆర్.కే. సింగ్ , మూర్తి, జాతీయ రహదారుల పీడీ సురేంద్రనాధ్,ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ చైత్రవర్షిణి తదితరుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *