Breaking News

గ్రామ స్థాయిలో “స్వచ్చతా హీ సేవా”…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
గ్రామ స్థాయిలో “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను నిబద్దతతో విజయవంతంగా నిర్వహించాలని, పన్నుల వసూళ్ళను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పంచాయతీ రాజ్, ప్రాధాన్యతా భవనాలు, ఉపాధిహామీ, జగనన్న స్వచ్చ సంకల్పం, ఎస్ డబ్ల్యూ పీసీ షెడ్స్ తదితర అంశాలపై కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, సంబందిత జిల్లా అధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రగతి పై వివరిస్తూ క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం లో భాగంగా 255 ఎస్.డబ్ల్యు. పి.ఎస్. షేడ్స్ లో 250 లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, ఐదు చోట్ల షేడ్స్ నిర్మాణాలు చేపట్టవలసి ఉందన్నారు. అక్టోబరు 2 వ తేదీ వరకు నిర్వహించ నున్న “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను పురష్కరించుకొని కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్లాప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని 300 గ్రామ పంచాయితీల పరిధిలో 200 గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ లో భాగంగా ప్రతి ఇంటిననుంచి చెత్త సేకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గల 4,63,535 గృహాలకు గాను 3 లక్షల 84 వేల గృహాలు నుంచి చెత్తను సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నివారణ కొరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. అందులో భాగంగా జిల్లాలోని 21 ప్రాంతాల్లోని నీటి గుంటలను గుర్తించామన్నారు. దోమలు ప్రభలకుండా తగు నివారణా చర్యలు తీసుకునేందుకు పంచాయితీ, వైద్యఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేశాలా దిశా నిర్థేశం చేశామన్నారు. పంచాయితీల పరిధిలో ఇంటి పన్నులు ఇతర పన్నులు వసూళ్ళకు సంబందించి వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా పంచాయితీ అధికారి ప్రత్యేక చర్యలు తీసుకోవాని ఆదేశించామన్నారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 26 లక్షల 43 వేల పనిదినాలు కల్పించడం జరిగిందని ఇప్పటి వరకు 23 లక్షల 11 వేల మందికి ఉపాధి వేతనం వారి ఖాతాలో జమ చేసామని కలెక్టరు మాధవీలత తెలిపారు. సగటు వేతనం రూ.250 రూపాయలకు చర్యలుతీసుకోవడం జరుగుతుందని ఆదిశలో మండలాభివృద్ది అధికారులకు దిశా నిర్థేశం చేశామన్నారు. జిల్లాలో 1101 ప్రాధాన్యతా భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని వీటిలో ఇప్పటి వరకు 643 భవనాలు పూర్తి కాగా 458 భవనాలు పురోగతిలో ఉన్నాయని వీటిలో 145 భవనాల నిర్మాణం పూర్తియ్యే దశకు చేరుకున్నాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *