Breaking News

పౌష్టికాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నివారించి పౌష్టికాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోషకాహార మాసోత్సవాల్లో భాగంగాజిల్లా మహిళాభివృది శిశుసంక్షేమ శాఖ,మార్పు ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో జ్యోతీ ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ మార్పు ట్రస్ట్,ఏలూరు సెయింట్ థెరిస్సా కాలేజ్ అధ్వర్యంలో న్యూట్రిషియస్ మిక్స్ పౌష్టికాహారాన్ని జిల్లాలోని 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వంద మంది చిన్నారులకు ఆరు నెలలు పాటు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం లోనే పైలట్ ప్రాజెక్ట్ గా జిల్లాలో న్యూట్రిషియస్ మిక్స్ పౌష్టికాహారాన్ని అర్బన్ పరిధిలో 345 అంగన్ వాడీలలో చిన్నారులకు అందించనున్నామన్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైబర్ వంటివి కలిగి ఉండేలా బాదం, జీడిపప్పు, ఓట్స్, ఎండు ఖర్జూరం, వేరుశనగ, పెసరపప్పు వంటి పదార్థాలతో చేసిన న్యూట్రీషియస్ మిక్స్ చిన్నారులకు అదనపు పౌష్టికాహారం లభిస్తుందన్నారు. అంగన్వాడిలో అమలు చేస్తున్న బాలామృతానికి తోడుగా సమపాళ్లలో చేసిన ఈ పౌడర్ ను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ముందుగా 100 మంది పిల్లలను ఎంపిక చేసి మూడు నుండి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు అందిస్తామన్నారు. మూడు సంవత్సరాల లోపు పిల్లలకు 10 గ్రాములు మూడు సంవత్సరాలు పైబడిన వారికి 15 గ్రాములు 100 ఎంఎల్ పాలతో కలిపి అందించాలని తద్వారా పౌష్టికాహార లోపం తగ్గుతుందని కలెక్టర్ అన్నారు. ఎంపిక చేసిన చిన్నారులకు అంగన్ వాడి కార్యకర్తలు సక్రమంగా న్యూట్రిషియస్ మిక్స్ పౌష్టికాహారాన్ని అందించి ఫలితాలు సాధించాలన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు రక్తహీనతను అధిగమించేందుకు స్థానికంగా లభించే మునగాకును ఉపయోగించుకోవాలని కోరారు. ప్రకృతిలో స్థానికంగా లభించే పెసరపప్పు గుమ్మడికాయలు మునగాకు అరటి పళ్ళు వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆరోగ్యకరమైన బాలల జననం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నదన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహార పదార్ధాలు లబ్దిదారులకు సక్రమంగా చేరువు చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల పోషణకు అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి చేయూతను అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గర్భవతిగా ఉన్నప్పుడే సరైన పోషకాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర చిన్నారులకు జన్మనిస్తారని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు.
కార్యక్రమంలో చిన్నారులకు న్యూట్రీషియస్ మిక్స్ పౌడర్ పంపిణీ, గర్భిణీలకు సాంప్రదాయ బద్దంగా పసుపు, కుంకుమ, చీరలతో సీమంతాలు నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. ఉమాదేవి,మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సూయుజ్, సెయింట్ థెరిస్సా కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ, న్యూట్రిషన్ హోమ్ సైన్స్ హెచ్ఓడి పద్మజ,ఇన్నర్ వీల్ స్వచంద సంస్థ డైరెక్టర్ కె.కవిత,వరల్డ్ విజన్ జిల్లా కోఆర్డినేటర్ జోషి, సిడిపిఓలు జి. మంగమ్మ,, కె. గ్లోరీ, వి. భాగ్య రేణుక, జె. లక్ష్మి భార్గవి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *