Breaking News

శ్రీశైలం దసరా నవరాత్రుల ఉత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *