అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్టు, దేవాదాయశాఖ కమిషనర్ ఎం హరి జవహర్‌లాల్, దుర్గగుడి ఈవో డి భ్రమరాంబ, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం జగన్‌ను విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్.జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవోలు ఉత్సవాలకు ఆహ్వానించారు.
Prajavartha Online Telugu News