Breaking News

సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలి…

-ఎం.డి. జాని పాషా రాష్ట్ర అధ్యక్షులు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
-సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఫెడరేషన్ కర్తవ్యం
-పలమనేరు నియోజకవర్గ సచివాలయ ఉద్యోగుల విస్త్రుత స్థాయి సమావేశంలో ఉద్యోగ సమస్యల పై చర్చించిన ఫెడరేషన్
-పలమనేరు నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల కమిటీల నియామకం
-సచివాలయ ఉద్యోగుల అనేక సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా దృష్టికి తీసుకొని వచ్చిన సచివాలయ ఉద్యోగులు
-జిల్లా వ్యాప్తంగా ఫెడరేషన్ సభ్యత్వం వేగవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షులు

పలమనేరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పలమనేరు నియోజకవర్గ సాధారణ సమావేశం స్థానిక ఏపీయన్జీఓస్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.హరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా వివిధ సమస్యలపై ఉద్యోగులు అందించిన వినతులు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బదిలీల గురించి ఉద్యోగులు కోరగా,ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు వినతులు అందించామని,వీలైనంత త్వరగా బదిలీలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నామని, సచివాలయ ఉద్యోగుల న్యాయమైన ప్రతి సమస్యని పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,సచివాలయ ఉద్యోగులంతా ఫెడరేషన్ లో సభ్యులుగా చేరాలని తెలిపారు. ఏపీయన్జీఓస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు ఆనంద్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఏకైక సంఘం ఏపీయన్జీఓస్ అసోసియేషన్ అని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపతి మాట్లాడుతూ పదవి అనేది బాధ్యత అని ఉద్యోగులకు సేవ చేయడం కోసం బాధ్యతగా పదవులు చేపట్టాలని తెలిపారు.

కమిటీల వివరాలు:
జిల్లా మహిళా వింగ్ సెక్రటరీ గా ఎన్. వల్లెమ్మ, పలమనేరు అర్బన్ కమిటీ అధ్యక్షులు గా భువనేశ్వర్ రెడ్డి, పలమనేరు రూరల్ కమిటీ అధ్యక్షులు గా రఘురామ్. కె, గంగవరం మండలం అధ్యక్షులు గా దామోదర్ నాయుడు, పెద్ద పంజాని మండల అధ్యక్షలు గా డి. శ్రీనివాసులు, బైరెడ్డిపల్లె మండలం అధ్యక్షులుగా కె. హరీష్ రెడ్డి, వి. కోట మండలం అధ్యక్షులుగా యస్. వెంకటాచలపతి నాయక్, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు గా జి. సుదీర్ కుమార్ రెడ్డి, పలమనేరు నియోజకవర్గం సమన్వయ కర్తగా పి. రమణ, ను ఎంపిక చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ సహ అధ్యక్షులు జ్యోతీశ్వర, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *