Breaking News

గడప గడపకు కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన…

-40 వార్డు సచివాలయాల పరిధిలో రూ. 8 కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ఒక్కొక్కటి రూ. 80 లక్షల చొప్పున సెంట్రల్ లో 4 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని మొత్తం 96 సచివాలయాలకుగానూ 40 వార్డు సచివాలయాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నట్లు వెల్లడించారు. ఆయా సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్ సమన్వయంతో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఒక్కో సచివాలయానికి రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 8 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే ప్రాధాన్యత క్రమంలో ఆయా డివిజన్లలో రోడ్లు, త్రాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వ్యవస్థ సహా మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలియజేశారు.

వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లతో పేదల ఆరోగ్యానికి భరోసా
నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత పటిష్ట పరుస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో మంజూరైన 4 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు (వాంబేకాలనీ, అయోధ్యనగర్, దేవీనగర్, ఇందిరానాయక్ నగర్) తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు వివరించారు. ఇందులో అయోధ్యనగర్ హెల్త్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిఒక్క హెల్త్ సెంటర్లోనూ ఒక మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక క్లీనింగ్ పర్సన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే శాశ్వత భవనాలు ఉన్న హెల్త్ సెంటర్ల మరమ్మతుల కోసం రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. దీంతో ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు ల్యాబ్ లు ఏర్పాటు చేసేందుకు ప్లాట్ ఫామ్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. మరోవైపు రోగి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఆధారంగా ఎలక్ట్రానిక్ ఐడీని క్రియేట్ చేసే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. ఈ హెల్త్ ఐడీ ద్వారా రోగి ఎన్నిసార్లు ఆస్పత్రికి వచ్చినా వారి పాత రిపోర్టులన్నింటినీ ఆన్ లైన్ లో చూసే అవకాశం ఉంటుందన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం అహర్నిశలు తపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని మల్లాది విష్ణు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *