-కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఐసీడిఎస్ ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత స్పష్టం చేసారు. సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం అందజేసిన 1601 చరవాణిలను జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ICDS) పథకం ద్వారా అందించే వివిధ సేవలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయడానికి గాను మొబైల్ సెల్ ఫోన్ లో వివిధ యాప్ లను పొందుపరచి అందిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం గా ప్రభుత్వాలు ఐసీడీఎస్ పథకాలను మహిళలకు, పిల్లలకు అందిస్తున్నామన్నారు. ఆయా పథకాల వివరాలు ప్రయోజన వివరాలు, లబ్దిదారుల వివరాలకూడి యాప్ లలో అనుసందానం చేయాల్సి ఉందన్నారు. ఇందు కోసం అత్యాధునిక సాంకేతికకత గలచరవాణిలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు. జిల్లాలలో ఐసీడీఎస్ సిబ్బందికి 1556 ఐసీడీఎస్ సూపర్వైజర్లకు 45 చరవాణిలను పంపిణీ చేశామన్నారు. పారదర్శకంగా వాటిని అండచెయ్యల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కాంప్లిమెంటరీ న్యూట్రిషన్ (CN), నాలెడ్జ్, యాటిట్యూడ్, ప్రాక్టీస్ (KAP), తక్కువ జనన బరువు (LBW) తదితర యాప్ లు ఈ మొబైల్ లో పొందుపర్చినట్లు ఐసీడీఎస్ జిల్లా అధికారి కె. విజయకుమారి తెలిపారు. ఆ పథకాలు ద్వారా 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు, 16-44 సంవత్సరాల వయస్సు గల స్త్రీలను లక్ష్యంగా ఉంటారని, గర్భిణీ – పాలిచ్చే తల్లులకు కమ్యూనిటీ యొక్క ఆరోగ్యం, పోషకాహారం,విద్య కు చెందిన ఇతర యాప్ లు కూడా ఇందులో పొందుపర్చడం జరిగిందని తెలిపారు.
Prajavartha Online Telugu News