-అన్ని శాఖలు వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి..
-కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 22 న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం లలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కారి పర్యటన విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
సోమవారం కలక్టరేట్ లో కేంద్ర మంత్రి పర్యటన పై జాయింట్ కలక్టరు శ్రీధర్ తో కలసి సంబందింత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో గల మోరంపూడి పై వంతెన పనులకు శంఖుస్థాపన చేసేందుకు వస్తున్న కేంద్రమంత్రి గడ్కారి స్థానికి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. అనంతరం కడియం నర్సరీ లను సందర్శించి నర్సరీల నిర్వాహుకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గోంటాన్నారు. పర్యటన ఆద్యాంతం విజయవంతం చేసేందుకు జాతీయ రహదారుల అధికారులు, జిల్లా అధికారుల సమన్వయం చేసుకోవాలని కలెక్టరు సూచించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి పర్యటన వివరాలుః-
ఈనెల 22 వ తేదీన గురువారం ఉదయం 9.30 గం.లకు డిల్లీ ఎయిర్ పోర్టు నుండి బయలు దేరి ఉ.11.30 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉ.11.50 గం.కు హెలికాప్టరు ద్వారా బయలు దేరి మ.12గం.లకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ కు చేరుకుంటారు. మ.12.10 గం.ల నుంచి 12.25 వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల ద్వారా చేపడుతున్న ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. తదుపరి మ. 12.30 గం. నుంచి మ.1.30 వరకు జాతీయ రహదారుల ప్రోజెక్టులకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ. 1.30 గం.లకు హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మ. 1.45 గం.లకు కడియం నర్సరీ హెలీప్యాడ్ కు చేరుకుంటారు. తదుపరి 1.45 గం. నుంచి మ.2.20 గం. వరకు కడియం నర్సరీని సందర్శించి నర్సరీ యజమానులతో ముఖాముఖి లో పాల్గొంటారు. మ. 2.30 గం. కడియం నర్సరీ హెలిప్యాడ్ నుండి బయలు దేరి గుంటూరు జిల్లాకు వెళతారు.
Prajavartha Online Telugu News