Breaking News

పారిశుధ్య వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలి…

-అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్చ్ అమృత్ మహోత్సవం లో భాగంగా సర్కిల్-1 పరిధిలోని 56వ డివిజన్ నందు పాత రాజరాజేశ్వరీ పేటలో గురువారం అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, విఎంసి అధికారులు, స్థానిక కార్పొరేటర్లు తో కలిసి స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచిలు ముద్దు అనే నినాదాలతో స్వచ్ఛత ర్యాలీ చేపట్టారు. ఎర్ర కట్ట డౌన్ లోనే పిచ్చి మొక్కలను పీకేసి ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. విజయవాడను స్వచ్చ నగరంగా మార్చడానికి ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని అదనపు కమీషనర్ జనరల్ శ్రీమతి శ్యామల గారు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి క్లాత్ బ్యాగ్ లను వాడాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు గుడ్డ సంచి లను అందజేసి, వారు మరికొందరికి అవగాహన కలుగజేయలని తెలిపారు. విజయవాడ నగర పాలక సంస్థ నిర్వహస్తున్న స్వచ్చ విజయవాడ కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని నగరాన్ని మరింత స్వచ్ఛ నగరంగా మార్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భగా ACG శ్యామల మరియు కార్పొరేటర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ ఏలకల చలపతిరావు, మరియు జోనల్ కమిషనర్-1 సుధాకర్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, SS -1 ఒబెస్వర రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, ప్రభాస్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *