విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పది అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. రేపు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10.30 వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. అన్నదానానికి బదులు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. నదీ స్నానం బదులుగా షవర్స్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 21 లక్షల లడ్డూ ప్రసాదాలను దేవస్ధానం సిద్ధం చేసింది. తొలిరోజు గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శరన్నవరాత్రుల్లో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో నేటి నుంచి విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Prajavartha Online Telugu News