Breaking News

ఈనెల 27, 28 ముఖ్యమంత్రి పర్యటన… : జిల్లా కలెక్టర్, ఎస్. పి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27 న తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారని అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్నారని పర్యటనలో చిన్నపాటి లోపాలు కూడా తలెత్త రాదని విధులు కేటాయించిన అధికారులు అప్రమత్తంగా వుండి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.

ఆదివారం  రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , జెసి డీకే బాలాజీ లు సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన పై పలు సూచనలు చేశారు. అనంతరం విమానాశ్రయము నుండి ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రదేశాలను ముందస్తు వాహనశ్రేణి తో పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు: ఈనెల 27న సాయంత్రం గన్నవరం నుండి బయలుదేరి నాలుగు 35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన్ని బయలుదేరి 5. 20 గంటలకు తిరుపతి గంగమ్మ గుడి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు, సాయంత్రం 6.00 గంటలకు అలిపిరి వద్ద ఏపీఎస్ఆర్టీసీ వారి విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 7:45 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను తీసుకువెళ్లి తిరుమల శ్రీవారికి సమర్పించి, 8 .55 గంటలకు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.

ఈనెల 28న ఉదయం 6.05 గంటలకు మరోసారి శ్రీవారిని దర్శించుకుని, 6:45 గంటలకు కొత్తగా నిర్మించిన పరకామణి, 7 10 గంటలకు లక్ష్మి వి పి ఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభించి, 8:45 గంటలకు తిరుమలలో బయలుదేరి 9:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.

ముందస్తు ఏర్పాట్లుగా పరిశీలనలో తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి నగర పాలక సంస్థ మేయర్ శిరీష కమిషనర్ అనుపమ అంజలి, ఆలయ ఈవో ము నెయ్య, చైర్మన్ గోపి యాదవ్ , అధికారులు ఉన్నారు. అలిపిరి వద్ద ప్రారంభించనున్న ఎలక్ట్రిక్ బస్సుల విషయమై రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి కి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు  అనంతరం తిరుమల చేరుకొని టిటిడి జే ఈ ఓ వీరబ్రహ్మం, సి ఎం ఓ భద్రతాధికారుల తో కలసి పద్మావతి అతిథి గృహం, బేడి ఆంజనేయస్వామి ఆలయం , శ్రీవారి ఆలయం, కొత్తగా నిర్మించిన పరకామణి, లక్ష్మీ వి పి ఆర్ రెస్ట్ హౌస్ లను పరిశీలించారు.

అనంతరం తిరుమలలో ఈవో ధర్మారెడ్డి తో సమావేశమయ్యారు. ఈ ముందస్తు ఏర్పాట్ల సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రామారావు, సి ఎస్ ఓ రాజశేఖర్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, కాన్వాయ్ ఇంచార్జ్ రెడ్డెప్ప, అధికారులుపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *