Breaking News

LRS -2020 స్కీముపై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( రుడా ), రాజమహేంద్రవరం సోమవారం ఉదయం 10.00 గంటలకు రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిళా రెడ్డి, రుడా వైస్ చైర్ పర్సన్ వి.వివేక్ ఆధ్వర్యములో LRS -2020 స్కీము ద్వారా దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు పెండింగులో ఉన్న 2725 మొత్తము దరఖాస్తులను పూర్తి చేయుటకు గాను, దరఖాస్తుదారులను మరియు లైసెన్స్ ఇంజినీరుతో కలిసి LRS -2020 గడువు తేది అక్టోబర్ 31 ముగియనున్నందున సదరు పెండింగులో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయుటకు గాను సూచనల కొరకు సదస్సు నిర్వహించియున్నామని రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం  సోమవారం రుడా  ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిళా రెడ్డి, రుడా వైస్ చైర్ పర్సన్  వి.వివేక్ ఆధ్వర్యములో LRS -2020 స్కీముపై సమావేశం నిర్వహించారు.

సదరు సరళీకృత చెల్లింపు పథకం-2020 (LRS-2020) స్కీము పెండింగ్ అప్లికేషన్స్ పై సదస్సునకు వచ్చిన దరఖాస్తుదారులకు వారి యొక్క దరఖాస్తు ఏ విధమైన కారణముతో పెండింగ్ లో వున్న అంశంపై సమీక్షించారు. LTP ద్వారా రుడా ఆఫీస్ వారికి ఇంకను ఏ విధమైన డాకుమెంట్స్ అందచేయవలిసి వున్నది అన్న విషయములను వివరముగా ధరఖాస్తు తెలియచేయడమైనది. లైసెన్సుడు ఇంజినీర్లను, ధరఖాస్తుదారులను ఇన్ ప్రిన్సిపల్ లేఔట్ ప్యాటర్న్ లను త్వరతగతిన పూర్తి చేయుటకు సహకరించవలిసినదిగా కోరియున్నారు. ఇప్పటివరకు 179 ప్యాటర్న్ లు మరియు 795 దరఖాస్తులను ఆమోదము పొంది ఉన్నవని తెలిపి వున్నారు. ప్రజలందరికి అనధికార లేఔట్ నందు ప్లాట్ లు కొనుగోలు చెయ్యవద్దని, ప్లాట్ లు కొనేముందు లేఔట్ అప్రూవల్ వివరములు అన్ని తెలుసుకొన్న పిదపనే ఇండ్ల స్థలాలను కొనుగోలు చేయవలిసినదిగాను, ఇండ్ల స్థలములను కొనే ముందర కార్యాలయ ప్లానింగ్ విభాగములో సంప్రదించవలసినదిగా స్థల అప్రూవల్ వివరముల తెలుసుకొన్న పిదపనే కొనుగోలు చేయవలసినదిగా కోరియున్నారు. ఈ సదస్సులో రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, రుడా వైస్-చైర్ పర్సన్ వి.వివేక్, రుడా ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *